కస్తూర్బా పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీకస్తూర్బా పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అడిషనల్ కలెక్టర్ రవి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుకతో కలిసి పాఠశాలలోని మౌలిక వసతులు, వంటశాల, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, కూరగాయల నాణ్యతను పరిశీలించారు.అనంతరం ప్రతి తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. బోధన విధానం, హాజరు, విద్యా ప్రమాణాలు, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ తనిఖీలో ఎంపీడీవో అనిల్ కుమార్, ఎమ్మార్వో భావు సింగ్, గ్రామ కార్యదర్శి ఆకారపు సురేష్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *