హోదా మార్చొద్దు.. లైన్‌మెన్‌లకే న్యాయం చేయండిహోదా మార్చొద్దు.. లైన్‌మెన్‌లకే న్యాయం చేయండి

డిజిటల్ గవర్నెన్స్‌లో భాగంగా ఏజెన్సీలు, కాంట్రాక్టు ఉద్యోగుల డేటా సేకరణ, వెరిఫికేషన్ ఆడిట్ సందర్భంగా మిషన్ భగీరథ పాలేరు గ్రిడ్ సెగ్మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న లైన్‌మెన్‌లు తమ సమస్యలను అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మిషన్ భగీరథ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శులు కలిసి అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనేక సంవత్సరాలుగా “లైన్‌మెన్” హోదాలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను ప్రభుత్వ రికార్డుల్లో “హెల్పర్”గా నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ భద్రత, సేవా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికుల అసలు విధులు, బాధ్యతలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ రికార్డుల్లో కూడా “లైన్‌మెన్” హోదానే నమోదు చేయాలని వారు కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం సమస్యను పరిశీలించి, పూర్తి నివేదికను సంబంధిత ఉన్నతాధికారులకు పంపిస్తానని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు. అధికారుల సానుకూల స్పందనతో తమ సమస్యకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని మిషన్ భగీరథ కార్మికులు వ్యక్తం చేశారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *