పండుగల వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత పండుగల వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత

అంబర్‌పేట, న్యూస్/ప్రతినిధి: హైదరాబాద్‌లోని డీడీ కాలనీలో గల నారాయణ ఒలంపియాడ్ స్కూల్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, పోతరాజుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. పాఠశాల ప్రాంగణంలో బోనాల పండుగ వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు, పండుగల వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను వారికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు సంప్రదాయ వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమానికి పాఠశాల జీఎం కే. గోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏజీఎం బాల పరమేశ్వరరావు, ఆర్‌అండ్‌డీ ప్రతినిధులు మీనా, మహేశ్వరి, ఏవో మల్లికార్జున్ రెడ్డి, కోఆర్డినేటర్లు నూర్జహాన్, రాధిక, వీపీలు శిరీష, నజీమ్తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల సంప్రదాయ వేషధారణ, బోనాల సమర్పణ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సహకారంతో వేడుకలు ప్రశాంతంగా, ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *