శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్
శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, ( తెలుగు గళం ) న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ లోనున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని శేర్లింగంపల్లి బిజెపి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు ఇందిరా నగర్ లో చాలా కాలం నుండి నెలకొన్న సమస్యలను సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ సృజన ను కలిసి కాలనీలోని సమస్యలను కమిషనర్ కు వివరించి అనంతరం వినతి పత్రం అందజేశారు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల జరిగిన హైడ్రా కూల్చివేతల వలన భవనం బాత్రూంలో పూర్తిగా దెబ్బతిన్నాయని వాటికి మరమ్మత్తులు చేపట్టి పునరుద్ధరించాలని మరో కాలనీ అయినా అంజయ్య నగర్ స్మశాన వాటికలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ కు తెలిపారు అదేవిధంగా అంజయ్య నగర్ దగ్గర రోడ్డు దాటాలంటే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వెంబడి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఖాళీ స్థలాలు కబ్జాలకు గురికాకుండా చూడాలని అంగన్వాడి ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని రోడ్లపై పెద్ద పెద్ద స్తంభాలకు కేబుల్ వైర్లు ఉండటం వల్ల పలు సమస్యలు వస్తున్నాయని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు వీటి అన్నిటిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని రవికుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్ కార్యదర్శి మణిభూషణ్ మాణిక్రావు డివిజన్ అధ్యక్షులు రవి నాయక్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు విజయేందర్ గణేష్ సంజీవ్ వెంకటేష్ ఆమని సహదేవ్ ధనరాజ్ నాయక్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
