అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి జ్యోతి
జాజిరి జ్యోతి(ఐద్వా సత్తుపల్లి మండల కార్యదర్శి)
సత్తుపల్లి,ఆర్ సి, సెప్టెంబర్ 03(తెలుగుగళం) న్యూస్:
గిరిజన యువతి శిరీష మృతికి బాధ్యులైన వారిని సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం మండల పరిధిలోని సిద్దారం గ్రామంలో జరిగిన ఐద్వా సమావేశంలో జ్యోతి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టి వారికి పూర్తి భద్రత కల్పించేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెం గ్రామానికి చెందిన ఓకె శిరీష హైదరాబాదులోని తుక్కుగూడ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు గా పని చేస్తున్న సమయంలో దారుణ ఘటనకు గురై మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. శిరీషపై అత్యాచారం చేసి హత్య చేశారనే ఆరోపణలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి, ఘటన వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వేధింపుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని జ్యోతి పేర్కొన్నారు. శిరీష కుటుంబానికి తక్షణ పరిహారం అందించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు
