సమస్య ఉందని తెలియగానే రంగంలోకి సర్పంచ్ దేవులపల్లి విజయ్ కుమార్..
ప్రజల ఇబ్బందులపై తక్షణ స్పందన.. సర్పంచ్ సేవలను అభినందించిన గ్రామస్థులు
తెలుగు గళం, ఏటూరునాగారం, సెప్టెంబర్ 05:
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల భద్రతకు ముప్పుగా మారిన ప్రమాదకర చెట్టు కొమ్మలను గ్రామపంచాయతీ సర్పంచ్ దేవులపల్లి విజయ్ కుమార్ స్వయంగా తొలగించే చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న బొడ్రాయి దేవత వద్ద భారీ చెట్టు కొమ్మలు రోడ్డుపైకి వాలడంతో ఎప్పుడు విరిగి పడతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం సర్పంచ్ విజయ్ కుమార్ దృష్టికి రాగానే వెంటనే స్పందించి, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ప్రమాదకరంగా ఉన్న కొమ్మలను తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించే ప్రజలకు ప్రమాదం తప్పడంతో పాటు, భవిష్యత్తులో చెట్టు కొమ్మలు విరిగి పడే అవకాశం కూడా తగ్గింది. గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ విజయ్ కుమార్ తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వదిలేయకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటున్న సర్పంచ్‌ను గ్రామస్తులు అభినందించారు. ప్రజల భద్రత, గ్రామ అభివృద్ధికి ఇదే విధంగా నిరంతరం పనిచేయాలని వారు ఆకాంక్షించారు.
