కడియం శ్రీహరి చొరవతో మిరుపకుంట, తిప్పాయికుంటలకు జలకళ.. ఏడాదిలో చిటమట చెరువుకూ నీరు

వేలేరు, సెప్టెంబర్ 6 (ఈ69న్యూస్)

కరువు పరిస్థితుల్లో సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న వేలేరు ప్రాంత రైతులకు గోదావరి జలాలు వరంగా మారాయి. వేలేరు రెవెన్యూ పరిధిలోని మిరుపకుంట, తిప్పాయికుంటలు గోదావరి జలాలతో పూర్తిస్థాయిలో నిండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకున్నారని వేలేరు గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, రైతులు తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే చర్చించి గోదావరి జలాలు కుంటలకు చేరేలా కృషి చేశారని పేర్కొన్నారు.కుంటలు నిండడంతో పంట పొలాలకు సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉందని రైతులు తెలిపారు. దీంతో వందలాది రైతు కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.ఏడాదిలో చిటమట చెరువుకు గోదావరి జలాలువేలేరు రెవెన్యూ పరిధిలోని చిటమట చెరువును కూడా ఏడాది కాలంలోపు గోదావరి జలాలతో నింపేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించినట్లు సర్పంచ్, రైతులు తెలిపారు. చిటమట చెరువుకు కూడా నీరు చేరితే పరిసర ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు భూగర్భ జలాల లభ్యత మెరుగుపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.మిరుపకుంట, తిప్పాయికుంటలు నిండటంతో రైతుల్లో నెలకొన్న ఆనందాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, రైతులు పంచుకున్నారు. రైతుల సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కత్తి సంపత్, ఉపసర్పంచ్ శ్రీకర్, రైతులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *