ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
సికింద్రాబాద్, పద్మారావునగర్:
ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో పద్మారావునగర్ పార్కులో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండె ఆరోగ్యం, గుండె సంబంధిత వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశి కె. శ్రీవాస్తవ, సీనియర్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ చంద్ర మౌళి పాల్గొని గుండె ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు.
అలాగే యశోద ఆసుపత్రి సీనియర్ ఏవీపీ గోపీ కృష్ణ, ఏవీపీ శ్రీధర్, జనరల్ మేనేజర్ దేవేందర్ ఎస్. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గుండె సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచించారు.
ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం ప్రజలకు ఆరోగ్యంపై మరింత చైతన్యం కల్పించింది.
