ప్రజావ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలిప్రజావ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం,నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైందని విమర్శించారు.ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని,కార్మికుల హక్కులను దెబ్బతీసే నాలుగు లేబర్ కోడ్లను,రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే, ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘ఎస్ఐఆర్’ ‘సర్’ ప్రక్రియలో భాగంగా తొలగించిన అర్హులైన ఓట్లన్నింటినీ విచారణ జరిపి వెంటనే పునరుద్ధరించాలని కోరారు.ఓటర్ల జాబితా వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ప్రధాని మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగం,ప్రజాస్వామ్య విలువలు,ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘం, ఎన్‌టీఆర్‌డీ, ఆదివాసీ గిరిజన సంఘం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *