హైదరాబాద్,భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా అఖిల భారత కాంగ్రెస్ సంఘం పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంవిధాన్ రక్షా కవాతులో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులుకేఆర్ నాగరాజు,పాల్గొన్నారు.హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన ఈ కవాతు నెక్లెస్ రోడ్డులోని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్, అఖిల భారత కాంగ్రెస్ సంఘం రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు బి.ఎం. సందీప్ కుమార్,రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు,శాసనమండలి సభ్యులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం,సామాజిక న్యాయం వంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే దేశ ప్రజాస్వామ్యాన్ని,ప్రజల హక్కులను కాపాడటమేనని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, సామాజిక న్యాయం,సౌభ్రాతృత్వం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు,అధ్యక్షులు, మండల అధ్యక్షులు, విభాగ అధ్యక్షులు,మాజీ కార్పొరేటర్లు,సర్పంచులు, ఉపసర్పంచులు,కౌన్సిలర్లు,వార్డు సభ్యులు,గ్రామశాఖ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



