ఈత చెట్టుపైనుండి జారిపడి గీత కార్మికుడు మృతిఈత చెట్టుపైనుండి జారిపడి గీత కార్మికుడు మృతి

​మరిపెడ మండలం మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన గౌడ సంఘం అధ్యక్షులు పోగుల సత్యం (60) ఆదివారం కల్లు గీసే క్రమంలో ఈత చెట్టుపైనుండి జారిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు.​కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, పోగుల సత్యం రోజు మాదిరిగానే కల్లు గీత కోసం చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి జారిపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనాస్థలంలోనే మృతి చెందారు.​మృతుడు పోగుల సత్యంకు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంతో గ్రామంలో, గౌడ సంఘంలో విషాదఛాయలు అలుముకున్నాయి

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *