గ్రామ అభివృద్ధే నా లక్ష్యం గ్రామ అభివృద్ధే నా లక్ష్యం

గెలిపించిన గ్రామ ప్రజలకు సర్పంచ్ కడుదూరి మమత సోమయ్య కృతజ్ఞతలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం హిమ్మత్‌నగర్ గ్రామ సర్పంచ్‌గా రెబల్ అభ్యర్థిగా గెలుపొందిన కడుదూరి మమత సోమయ్య,తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తానని ఆమె స్పష్టం చేశారు.గ్రామ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి,ఎంపీ కడియం కావ్య సహకారంతో గ్రామానికి అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.గ్రామంలో అన్ని వర్గాలు,అన్ని పార్టీల వారిని కలుపుకుని సమన్వయంతో ముందుకు సాగుతూ,రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని గ్రామ ప్రజలు సహకరించాలని సర్పంచ్ మమత సోమయ్య కోరారు.హిమ్మత్‌నగర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆమె అన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *