క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలుక్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు

శాంతి,ప్రేమ,కరుణల సందేశాన్ని ప్రపంచానికి అందించిన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ సందేశాన్ని వెల్లడించారు.ఏసుక్రీస్తు బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని,ప్రేమ,సేవాభావం,మానవత్వంతో ప్రజలు జీవించాలని కలెక్టర్ పేర్కొన్నారు.సమాజంలో శాంతి,సౌహార్దం నెలకొనాలంటే ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో మెలగాలని సూచించారు.క్రిస్మస్ పండుగను అన్ని వర్గాల ప్రజలు పరస్పర సోదరభావంతో,ఐక్యతతో ఘనంగా జరుపుకోవాలని కోరారు.జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో జీవించాలని,భగవంతుని దీవెనలు అందరికీ ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *