క్రిస్మస్ వేడుకలు-నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ క్రిస్మస్ వేడుకలు-నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ

మల్లవరం గ్రామంలో క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాస్టర్ మేడి యాకోబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో,సంఘములో సేవలందించిన వీరం రాజు జ్ఞాపకార్థంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పల రాజు నిర్వహిస్తూ,ఏసుక్రీస్తు ప్రేమ,కరుణ,సేవా భావాన్ని ప్రతిబింబించేలా సహాయ కార్యక్రమం చేపట్టారు.క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పేద కుటుంబాలకు దుప్పట్లు అందించడం ద్వారా మానవత్వాన్ని చాటారని గ్రామస్తులు ప్రశంసించారు.ఈ సందర్భంగా అప్పల రాజు మాట్లాడుతూ,ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ,సేవా మార్గాన్ని అనుసరించడమే ఈ కార్యక్రమానికి ప్రేరణగా నిలిచిందని తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాస్టర్ మేడి యాకోబుకు,సహకరించిన సంఘ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో సంఘ సభ్యులు,గ్రామ పెద్దలు,స్థానికులు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *