రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంరోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

సత్తుపల్లి పట్టణం లోని పోస్ట్ బొమ్మ సెంటర్ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యారు సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన పొదిలి. నారాయణరావు59సంవత్సరాలు ఈ ప్రమాదానికి ప్రాణాలు కోల్పోయారు వ్యాపార నిమిత్తం సత్తుపల్లి పట్టణానికి వచ్చిన నారాయణరావు ప్రమాదానికి గురయ్యారు ప్రత్యక్ష సాక్షులు కథనం ప్రకారం వెనక నుంచి వచ్చిన లారీ డి కొట్టడంతో అదుపుతప్పి కింద పడిపోయి లారీ టైర్ కింద నలిగిపోవటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు సమాచారం అందిన పోలీసులు 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే మృతి దేహాన్ని పరిశీలించారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేస్ నమోద్ చేసి దర్యాప్తు చేపట్టారు మృతుడు నారాయణరావు ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారం స్థానిక మండలాలతో పాటు చుట్టుపక్కల గ్రామంలో తిరుగుతు ఫ్యాన్సీ ఐటమ్స్ విక్రమించేవారు ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు కుటుంబ పెద్ద అకాల మరణంతో కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *