పెనుబల్లి యువకుడు మోతి కుమార్
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్28(తెలుగుగళం) న్యూస్:ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలం వియం బంజర్ నివాసి ఐన బి.రంజా కుమారుడు బి.మోతి కుమార్ భారతదేశ యువకుడిగా దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ధృడ సంకల్పంతో ప్రారంభించిన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5,364 మీటర్లు) ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.ఇండియా నుంచి నేపాల్‌లోని ఖాట్మండు విమానాశ్రయం ద్వారా లుక్ల వరకు చేరుకుని, అక్కడి నుంచి తీవ్ర చలి, ఆక్సిజన్ కొరత, ప్రమాదకరమైన పర్వత మార్గాల్లో ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ మొత్తం 53 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ను 26 గంటల 9 నిమిషాల 47 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది.
ఈ ప్రయాణంలో తన ప్రధాన లక్ష్యం —
భారత జాతీయ పతాకాన్ని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద గర్వంగా ఎగురవేసి దేశ గౌరవాన్ని నిలబెట్టడం.
సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉంది అని ఈ విజయం తన వ్యక్తిగత సాధన మాత్రమే కాదు అని, దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను అన్నారు.
త్వరలోనే ప్రపంచంలోనే అత్యున్నత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తులో ఎగురవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను అని అన్నారు.తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మార్గదర్శకులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.