సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ప్రోత్సహం అందిస్తున్నాయి
ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలను రైతులకు పరిచయం చేయాలి
రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను కూడా పెంచాలి
పాడి పశువుల వల్ల రైతులకు అదనపు ఆదాయం సమాకూరుతుంది
సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉంటుంది
ఎరువులు,క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించాలి
శాస్త్రవేత్తలు రైతులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించినప్పుడే వాస్తావ పరిస్థితుల పై అవగాహన కలుగుతుంది
స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మల్లించినప్పుడే రైతులకు,ప్రజలకు మేలు జరుగుతుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.రఘునాథపల్లి మండలం నీడిగొండలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం,తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ కొత్త రకం విత్తనాలు,వ్యవసాయ పనిమొట్లు,సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ లను పరిశీలించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…పత్తి సాగు,ఉత్పత్తి పెంచడానికి రైతులు,శాస్త్రవేత్తలతో కలిసి ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రతీ సంవత్సరం ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నప్పటికి ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదని అన్నారు.పత్తిలో అధిక సాంధ్రత పాటిస్తే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్న సలహాలను రైతులు పాటించాలని సూచించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు.వ్యవసాయానికి సంబంధించి సబ్సిడీలు బోనస్లు ఉచిత విద్యుత్ రైతు భరోసా వంటి పథకాలతో ఏడాదిలో ఒక ఎకరానికి 20,000 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని అన్నారు.వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులను సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.ఎక్కువ క్రిమిసంహారక మందులు వాడటం వల్ల భూమి సాంద్రత కోల్పోవడంతో పాటు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నామని అన్నారు.రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను కూడా పెంచాలని పాడీ పశువుల ద్వారా అదనపు ఆదాయం సమకూర్తుందని తెలిపారు.అలాగే సేంద్రియ వ్యవసాయానికి పశువుల పేడ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.ఎరువులు క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయాలని రైతులను కోరారు.వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని అప్పుడే వ్యవసాయం క్షేత్రంలోని వాస్తవ పరిస్థితుల పైన అవగాహన కలుగుతుందని సూచించారు.రైతులు ఒకే పంటను వేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలి తెలిపారు.రైతులు ఎక్కువగా మరి పత్తి మొక్కజొన్న వంటి పంటలనే ఎక్కువగా వేస్తున్నారని అలా కాకుండా ఆకుకూరలు కూరగాయలు చిరుధాన్యాలు వంటి పంటలను కూడా పండించాలని అన్నారు.జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ….సేంద్రియ వ్యవసాయానికి రైతులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.ఆ దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించాలని అన్నారు.పత్తి పంటకు వచ్చే తెగుళ్ల నివారణకు సేంద్రీయ పద్ధతులను అనుసరించే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.అధిక ఎరువులు క్రిమిసంహారక మందులు వాడటం వలన ఎదురయ్యే ఇబ్బందులను రైతులకు వివరించాలన్నారు.ప్రధాన పంటలతో పాటు రెండో పండగ రాగులు,సజ్జలు జొన్నలు వంటి చిరుధాన్యాలను పండించాలన్నారు.అవసరం మేరకు మాత్రమే యూరియాను ఉపయోగించాలని అధికమవుతాదిలో యూరియాను వాడటం వల్ల భూమి సాంద్రత కోల్పోతుందని తెలిపారు.నానో యూరియాను రైతులు ఉపయోగించాలని సూచించారు.రైతులు అందరూ అధిక విస్తీర్ణంలో ఒకే పంట పండించడం మాని అన్ని రకాల పంటలు పండించాలన్నారు.మార్కెట్ కు అనుగుణంగా పంటలు పండించినట్లయితే రైతులకు పండిన పంట అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉండవన్నారు.అధిక సాంద్రత పద్ధతి లో పత్తి పంట సాగుచేయడం వలన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందని…యాసంగి పంట కాలానికి పంట మార్పిడి చేసుకొని ఇతర పంటలు సాగు చేసుకోవాలన్నారు.రైతులు రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రీయ మరియు సహజ సాగు విధానంలో పంటలు పండించాలని కోరారు.రైతులందరూ నూతన సాంకేతిక విధానాన్ని అవలంబించాలని తెలియజేస్తూ ఈ యాసంగి పంట కాలం నుండి యూరియా ఎరువును ఆన్లైన్ యాప్ లో బుక్ చేసుకొని కొనుగోలు చేయాలన్నారు.రైతులందరూ వ్యవసాయ అనుబంధ శాఖల శాస్త్రవేత్తలు,అధికారుల సూచనలు సలహాలు తీసుకొని అధిక దిగుబడులు పొందాలని కోరారు.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కిసాన్ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు,విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలు,రైతులు,తదితరులు పాల్గొన్నారు