జన ఐక్యతకు స్నేహితుల దినోత్సవం దోహదం: మల్లూరు చంద్రశేఖర్
ప్రపంచ ప్రజల మధ్య జన ఐక్యత అవసరమని,దేశాల మధ్య మైత్రి అవసరమని ఐక్యరాజ్యసమితి భావించిందని అట్టి భావన నుండి1935 లో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ప్రారంభం అయ్యిందని సీఐటీయూ ఖమ్మంజిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఒకో దేశంలో ఒకో రోజు జరుగుతుందన్నారు.
భారతదేశంలో ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుగుతుందన్నారు.నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల మర్లపాడు గ్రామంలో షాపింగ్ ఆల్ హమాలి కార్మికుల అడ్డాలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.కార్మికులు ఒకరికి ఒకరు రక్షాలు కట్టుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.ఈ సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న మల్లూరు హమాలీ సంఘం అధ్యక్షులు పర్సా అప్పారావు కు రక్షా కట్టారు.అనంతరం సభలో చంద్రశేఖర్ మాట్లాడుతూ రక్ష అనేది ఫ్యాషన్ కాదని అది మన మణికట్టుపై ఆగుపించిన ప్రతిసారి మన మధ్య స్నేహం గుర్తొస్తోందని,మన మిత్రుని కష్టసుఖాల బాధ్యత మనకు ఉందని,సమాజ శ్రేయస్సు కోసం పోరు చేసే సీఐటీయూ సంఘంలో సభ్యులుగా ఉన్నామని,పోరాటాలలో ఉండాలని రక్షా బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు.
కార్మికులు అందరు స్నేహితులు లాగ ఐక్యమత్యంగా ఉండి పాలకుల,యాజమాన్యాలపై హక్కుల రక్షణ కోసం,కూలీ ధరల పెంపు కోసం,కార్మికవర్గ రాజ్య స్థాపన కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.ఆగస్టు 10 న క్విట్ ఇండియా డే ను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జరగనున్న జైల్ బరో కార్యక్రమంలో అందరు పాల్గొనాలని కోరారు.అనంతరం మల్లూరు గృహం వద్దకు బాల బాలికలు వెళ్లి రక్షాలు ఆయన చేతికి కట్టి స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.పసి హృదయాల ప్రేమ గొప్పదనీ బాల బాలికలను చంద్రశేఖర్ ఆశ్వీరదించారు.చిన్ననాటి నుండే ఐక్యంగా స్నేహంగా ఉండటం మంచి అలవాటు అని చిన్నారులతో కాసేపు ముచ్చటించి మిఠాయిలు పంచారు.ఈ కార్యక్రమాలలో: హమాలీ కార్మికులు గజ్జెల్లి సత్యనారాయణ,కనమాల నాగరాజు,జోజి,దిలీప్,దారా శ్రీను,యామవరపు శ్రీను,గజ్జెల్లి వెంకటేశ్వరరావు,నడ్డి ప్రసాద్,కనపర్తి కృష్ణ, పూరేటి ముత్తయ్య, దారా నాగు,అభి తదితరులు పాల్గొన్నారు.
