మండల ఫోటోగ్రాఫర్ల కార్యవర్గ ఎన్నిక
స్టేషన్ ఘనపూర్ మండలంలోని శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయంలో ఫోటోగ్రాఫర్లు సమావేశం కావడం జరిగింది.ఈ సమావేశంలో స్టేషన్ ఘనపూర్ మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల కార్యవర్గాన్ని ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.సీనియర్ ఫోటోగ్రాఫర్ వల్లాల మురళి(మయూరి స్టూడియో) గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. చిట్టాల సురేష్ (నక్షత్ర స్టూడియో) మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షలుగా తాటికొండ శ్రీధర్ (తాటికొండ), ఎండి జాఫర్ (సముద్రాలు),ప్రధాన కార్యదర్శి మారపాక అన్వేష్ (ఘనపూర్),సహాయకార్యదర్శి ఈగ విజయ్ కుమార్ (సముద్రాల),కోశాధికారి వల్లాల సతీష్ (ఘనపూర్),ముఖ్య సలహాదారులుగా మహేశ్వరం ప్రకాశ్, మహేశ్వరం శ్యాం సుందర్,గుడికందుల రమణకుమార్,
ఊరడి రాజు,మొగుదుంపురం కిశోర్,కార్యవర్గ సభ్యులుగా
కత్తెరశాల నగేష్,కొత్తకొండ అనిల్, పారునంజు కుమార్, బైరపాక మనోజ్ కుమార్, కోల రాజు లను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల ఫోటోగ్రాఫర్లు పాల్గొనడం జరిగింది.
