వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

చర్ల మండల కేంద్రంలో సర్వే నెంబర్ 117 లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని వరద బాధితులకు ఇళ్ల స్థలాల కై కేటాయించాలని అట్టి భూమిలో వరద బాధితుల పోరాట సంఘం ఆధ్వర్యంలో వందలాదిమంది ముంపు ప్రజలు గుడిసెలు వేయడం జరిగింది ఈ సందర్భంగా వరద బాధితుల పోరాట సంఘం గౌరవ అధ్యక్షుడు కొండాచరణ్ మాట్లాడుతూ మొగుళ్లపల్లి, గొంపల్లి, లింగాపురం, కొత్తపల్లి, తేగడ, గొమ్ముగూడెం, పంచాయతీలలో గ్రామాల లోని ప్రజలు ప్రతీ యాట ముంపుకు గురి అయ్యి యంతో ఇబబందులు పడుతున్నారని వారికి శాశ్వత పరిస్కారంగా మెరక ప్రాంతంలో ఇంటిస్థలాలు ఇవ్వాలని పలు దఫాలుగా అధికారులను కోరామని అన్నారు ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నాయి తప్ప ఉపయోగం ఏమి లేదని కనీసం సర్వే కూడా చేయడంలేదని అన్నారు వరద బాధితులు అంటే ఎందుకు ఇంత చులకన అని ప్రశ్నించారు అందుకనే వరద బాధితులే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని చూసి గుడిసెలు వేసుకున్నారని అన్నారు నిరుపయోగంగా కాలిగా ఉన్న సర్వేనంబర్ 117 లోని ప్రభుత్వ భూమిని వెంటనే వరదబాధితులకు కేటాయించాలని అన్నారు ఇంటి జాగాలు ఇచ్చేవరకు ఇక్కడ నుంచి ఇంచు కూడా కదిలేది లేదు అని అన్నారు అధికారులు వరదబాధితులు పడుతున్న బాధని అర్ధం చేసుకోవాలని కోరారు ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలని ముంపు సమస్య నుంచి బాధితులను శాశ్వత పరిష్కారం చూపించాలని అన్నారు
భూమికోసం యంత దూరమైనా వెళ్తామని ఎవ్వరినైనా ఎదిరిస్తామని అన్నారు వరద బాధితులు తెగించి పోరాడాలని ఐక్యంగా ఉద్యమించి ఇంటి జాగాలు సాధించుకోవాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో వరద బాధితుల పోరాట సంఘం అధ్యక్షులు బోడా సందీప్, కార్యదర్శి కొండా కౌశిక్, సహాయ కార్యదర్శి పాలెం చుక్కయ్య, ఉపాధ్యక్షులు పురిటి ప్రశాంత్, ఉపాధ్యక్షులు గుమ్ముల సర్వేశ్,ఉపాధ్యక్షులు నాగరత్నం, సభ్యులు బాలరాజు, ముంపు గ్రామస్థులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *