మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి. నర్సింగపూర్,మెట్టుపల్లి,మొట్లపల్లి,ఎల్లారెడ్డి పల్లి,కాసులపాడ్,పిడిసిల్ల, ముల్కలపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నరసింగాపూర్ గ్రామంలో రూ.20లక్షలతో నూతన గ్రామపంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. మెట్టుపల్లి గ్రామంలో 30 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీని ప్రారంభించారు అనంతరం గ్రామంలో 20 లక్షలతో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆదనపు గదులను ప్రారంభించారు. మోట్లపల్లి గ్రామంలో మహిళలకు ఉచితంగా అందిస్తున్న కుట్టు మిషన్లను మరియు దసరా పండుగ చీరలను కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. గ్రామంలో రూపాయలు 10 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. కాసులపాడు గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో కోటి 50 లక్షలతో నిర్మిస్తున్న నుతన బ్రిడ్జి నిర్మాణ పనులు మరియు 9.90లక్షలతో నిర్మించనున్న యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పిడిసిల్ల గ్రామంలో రూ. 10లక్షలతో మరియు ములకలపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *