బహుజనులకు సేవ చేస్తా నన్ను ఆశీర్వదించండిబహుజనులకు సేవ చేస్తా నన్ను ఆశీర్వదించండి

బహుజనులకు సేవ చేస్తా నన్ను ఆశీర్వదించండి, డోర్నకల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి పార్వతి రమేష్ నాయక్ కోరారు. శనివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సీరోల్ మండల కేంద్రంలో ఆటోలపై కూలీ కి వెళ్తున్న కూలీలను కలిసి మాట్లాడారు. ఈసందర్బంగా తను మాట్లాడుతూ
అగ్రకుల దొరల పార్టీల ఎలుబడిలో సన్న,చిన్న కారు రైతులు భూమి లేని పేదలు,కూలీలుగా మారి వలసలు వెళ్తున్నారని,దొరలు మాత్రం బినామీ పాలకుల అధికారాన్ని ఉపయోగించుకొని లక్షల కోట్లకు పడగలెత్తుచున్నకారణంగా సబ్బండా జాతులకు విద్య, వైద్యం, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుచున్నారని బిఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలొ బహుజన రాజ్యం సాధిస్తామని,బహుజనులకు విద్య, వైద్యం, ఉపాధి పూర్తి ఉచితంగా అందిస్తామని ఏనుగు గుర్తుపై ఓటేసి బిఎస్పీ పార్టీని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జీ ఐనాల పరశు రాములు, జిల్లా ఈ సి మెంబర్ ఎడ్ల శ్రీను అసెంబ్లీ మహిళ కన్వీనర్ జినక సువార్త,బిఎస్పీ కురవి మండల అధ్యక్షులు మేడి రాములు,మరిపెడ మండల అధ్యక్షులు జినక కృష్ణమూర్తి,చిన్నగూడూరు మండల మహిళ కన్వీనర్ వంగూరి స్వరూప తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *