గత సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ ని గెలిపిస్తాయిగత సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ ని గెలిపిస్తాయి

నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామంలో బొల్లం మల్లయ్య యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ వివిధ ప్రార్ధన మందిరాలలో ప్రార్థనలు జరిపి గడపగడపకు టిఆర్ఎస్ పార్టీ అందించిన సంక్షేమ పథకాలు తెలియజేస్తూ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి మహిళకు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం సిలిండర్ ధర 400 రూపాయలకు, 16 వేల రూపాయల వరకు రైతుబంధు లాంటి అనేక సంక్షేమ పథకాలను అందించేందుకు బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పథకాలన్నీ ఇంటింటికి చేరాలంటే బొల్లం మల్లయ్య యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అటువంటి అవసరం ఉందని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పల్లా నర్సిరెడ్డి , చంద్రయ్య, దేవ బత్తిని సురేష్ ప్రసాద్ ,కాసాని వెంకటేశ్వర్లు, దేవ బత్తిని వెంకట నరసయ్య, మార్తి ఉపేందర్, యాతాకుల వీరస్వామి , పోలంపల్లి వెంకటేశ్వర్లు, ఫిరోజ్ ,గోవింద్, బడేటి శీను, నలమాద నారాయణరావు, నాగేశ్వరరావు ,లాల్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *