గుడిస వాసులకు ఎమ్మెల్యే నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ వైఖరి ప్రకటించాలిగుడిస వాసులకు ఎమ్మెల్యే నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ వైఖరి ప్రకటించాలి

ఈరోజు సిపిఎం జిల్లా ఆఫీస్ రాంనగర్ లో న్యూ శాంపేట కందుల బండ భూ పోరాట కమిటీ సమావేశం బచ్చు భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చుక్క గారు మాట్లాడుతూ. గత పది నెలలుగా కందుల బండ ప్రాంతంలో నిలువ నీడ లేనటువంటి పేద ప్రజలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వారికి సరైన సదుపాయాలు కరెంట్. వాటర్ లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ భూమి లో గుడిసెలు వేసుకున్న గుడిస వాసులందరికీ. పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలని. ఓట్ల కోసం ఇల్లు ఇల్లు వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు గుడిశవాసుల పట్ల తమ వైఖరి స్పష్టంగా ప్రకటించిన తర్వాత ఓట్ల కోసం రావాలని.. ఓట్ల కోసం వచ్చే అభ్యర్థులను గుడిశవాసులు నిలదీయాలని. వారి నుండి స్పష్టమై నా హామీ లభించిన తర్వాతనే మనకు ఉపయోగపడే అభ్యర్థికి మాత్రమే మన ఓటును వినియోగించాలని. అందుకే వారి వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ. పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని. కనీసం ఉపాధి అవకాశాలు కల్పించకుండా. మొక్కుబడి సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెడుతూ పేదలను మరింత పేదవారిగా తయారు చేస్తున్నాయి. మరిన్ని అమలు కానీ హామీలతో ఓట్ల కోసం మీ వద్దకు వచ్చే అభ్యర్థులను నిలదీసి మన అవసరాలు తీర్చే స్పష్టమైన హామీ ఇచ్చే అభ్యర్థికే మన ఓటు వేసి ఓటు విలువను. ఓటు యొక్క ప్రాధాన్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భూ పోరాట కమిటీ నాయకులు ఓరుగంటి సాంబయ్య, విమల, సుజాత, రజిత, ఉమా, లలిత, శిరీష పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *