జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు గాలికి వదిలేయడం చాలా దురదృష్టకరంజర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు గాలికి వదిలేయడం చాలా దురదృష్టకరం

ప్రింట్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ కమిటీ ఆవేదన వ్యక్తం చేశారు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే తారతమ్యం వ్యక్తపరుస్తూ జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రజా ప్రతినిధులు వాక్యానించడం దురదృష్టకరమని ఆదివారం బండ్లగూడలో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆ కమిటీ సభ్యులు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల మీద సానుకూలంగా స్పందించి రాష్ట్రంలోనే అనేక నియోజకవర్గాలలో ఇండ్ల స్థలాలను కేటాయించడం జరిగింది, కానీ ఎల్బీనగర్ నియోజకవర్గం లో మాత్రం కొందరి జర్నలిస్టులను తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు పెద్ద చిన్న పత్రికలు అనే తారతమ్యం చూపుతూ కొందరు జర్నలిస్టులు మాత్రం వారి కడుపు నింపుకొని మిగిలిన జర్నలిస్టుల కడుపు కొట్టారని పేర్కొన్నారు మిగిలిన జర్నలిస్టులకు రెండవ దఫాలో ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని చెప్పిన ఎల్బీనగర్ శాసనసభ్యులు కాలయాపన చేశారు తప్ప కార్యచరణ రూపం దాల్చాక పోవడం ఒక ఎత్తు అయితే అంతలోపే సార్వత్రిక ఎన్నికలు రావడం ఒక సాకుగా దారితీసింది ఎన్నికలు అనంతరమైన ఏర్పడ్డ ఏ ప్రభుత్వమైనా సరే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రావలసిన రాయితీలను కేటాయించాలని ఎల్బీనగర్ ఫ్రెండ్ మీడియా జర్నలిస్టుల జేఏసీ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పగడాల దేవయ్య మహమ్మద్ నజీమ్, చిట్యాల దస్తయ్య రాపోలు లింగస్వామి,నల్ల యాదయ్య తదితర జర్నలిస్టులు పాల్గొనడం జరిగింది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *