cm of telangana revanth reddy photoscm of telangana revanth reddy photos

హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుండి చివరి వరకు మూసి నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.

నేడు డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ, శాసన సభ్యులు శ్రీ అక్బరుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమార్తి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండి శ్రీ దాన కిషోర్, సీఎంఓ అధికారులు శ్రీ శేషాద్రి, శ్రీ శివధర్ రెడ్డి, శ్రీ షానవాజ్ ఖాసీం, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్రె డ్డి మాట్లాడుతూ, మొత్తం మూసీ పరీ వాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా స్వీయ ఆర్థిక చోదక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందుకుగాను, మూసీ నదీ వెంట బ్రిడ్జిలు, కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్సులు, అమ్యూజ్ మెంట్ పార్కులు, హాకర్ జోన్ లు, పాత్-వేలను ప్రభుత్వ, ప్రయివేటు పార్ట్నర్ షిప్ విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. మూసీలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు తగు నీటి మట్టం ఉండేలా చెక్ డ్యాంలు నిర్మించాలన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *