Bhadrachalam - Latest News in TeluguBhadrachalam - Latest News in Telugu

భారతదేశానికి చెందిన అపర గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల నందు ఒకరోజు ముందుగానే గణిత శాస్త్ర వేడుకలు నిర్వహించినారు.
ఈ కార్యక్రమాన్ని లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ మాగంటి శ్రీనివాస వరప్రసాద్ మరియు శ్రీ మాగంటి రమేష్ బాబు ప్రారంభించారు. తర్వాత శ్రీ మాగంటి శ్రీనివాస వరప్రసాద్ మరియు శ్రీ రమేష్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, రామానుజన్ గణితంలో సాధించిన విజయాలను గణిత శాస్త్ర అభివృద్ధికై చేసిన కృషిని వివరించారు. కావున కటోర తపస్సుతో మనిషి అనుకున్నది సాధించగలడని దానికి శ్రీనివాస రామానుజన్ నిదర్శనమని విద్యార్థులకు సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చేసినటువంటి పాలిగన్స్ నమూనాలు, పైథాగరస్ సిద్ధాంతం, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, వాస్తవ సంఖ్యలు, వైశాల్యము మరియు చుట్టుకొలత, త్రికోణమితి, సంభావ్యత, మొదలైన అంశాలపై ప్రాజెక్టులు ప్రదర్శించినారు.
ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల కో డైరెక్టర్స్ శ్రీమతి మాగంటి శారద, శ్రీ మాగంటి సాయి సూర్య, ఉపాధ్యాయ బృందము, విద్యార్థినీ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *