మండల ప్రత్యేక అధికారి…డిఎఫ్ఓ సతీష్ కుమార్
గళం న్యూస్:జనవరి 20(నడిగూడెం) గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మండల ప్రత్యేక అధికారి, డీఎఫ్ఓ సతీష్ కుమార్ అన్నారు.మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నందు శనివారం పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ 2024- 25 ఆర్థిక సంవత్సరానికి గ్రామపంచాయతీ డెవలప్మెంట్ కార్యక్రమం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంతో వ్యవహరించవద్దని సూచించారు. సమావేశంలో తాసిల్దార్ హేమమాలిని, ఎంపీడీవో సయ్యద్ ఇమామ్,వివిధ శాఖల మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
