telugu galam news e69news local news daily news today newstelugu galam news e69news local news daily news today news

(డివైఎఫ్ఐ)… భారత దేశ స్వాతంత్ర పోరాట సమరయోధుల్లో అత్యంత గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని చిన్ననాటి నుండే జాతీయ భావాలతో స్ఫూర్తి పొంది జాతీయ ఉద్యమంలో అడుగుపెట్టి, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతరేకంగా ఉద్యమాన్ని కొనసాగించి చరిత్రలో నిలిచిపోయినగొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కై లాబ్ బాబు లు అన్నారు. మంగళవారం (డివైఎఫ్ఐ) రాష్ట్ర కార్యాలయంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ల ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతిని పురస్కరించుకొని, నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొప్ప విద్యావంతుడుగా, దేశభక్తి భావాలు కలిగిన వాడు, ధైర్యం త్యాగనిరతి,సాహసం ఎంతో ఉత్తేజమిస్తాయి అని అన్నారు. మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని తెచ్చి పెడతాననే నినాదం ఇచ్చి దేశ ప్రజలు యువతకు ఆదర్శంగా నిలిచాడు.ఐఎన్ఏ (ఇండియన్ నేషనల్ ఆర్మీ ) నీ స్థాపించడంతోపాటు, ఆజాద్ హింద్ పౌజు అనే ఒక బలమైన సంస్థ ద్వారా స్వతంత్ర పోరాటాన్ని నడిపాడు.బ్రిటిష్ ప్రభుత్వం లో ప్రతిష్టాత్మకమైన ఐసిఎస్ లో నాలుగో ర్యాంకర్ గా వచ్చినప్పటికీ, దాన్ని వదులుకొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి. స్వాతంత్ర పోరాట విషయంలో గాంధీజీతో సైద్ధాంతికంగా విభేదించి సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నాడు. మతతత్వం, మతోన్మాదం విషయంలో నిక్కచ్చి గా వ్యవహరించాడు. అనేకమార్లు జైలు జీవితాలు నిర్బంధాలకు గురైనాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పై రాజీ లేని పోరాటం చేశాడు. జాతీయ ఉద్యమంలో ఏమాత్రం పాల్గొనని వారు, బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో రాజీ పడ్డవారు హిందుత్వవాదులు. వాళ్లు నేడు సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు.హిందూత్వ సిద్ధాంతం పైన, ఆరెస్సెస్‌ విధానాల పైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ తీవ్రమైన విమర్శలు చేశారు అని తెలియజేశారు. ‘మతతత్వ మనస్తత్వం పోయినప్పుడే మతతత్వం పోతుంది. కాబట్టి మతతత్వాన్ని మట్టుపెట్టడమనే పని ముస్లింలు, సిక్కులు, హిందువులు, క్రైస్తవులు తదితరులందరిదీ, భారతీయులందరిదీ. దీని కోసం వారంతా మతతత్వ దృక్పథాన్ని అధిగమించి నిజమైన జాతీయవాద మనస్తత్వాన్ని అలవరచుకోవాలని పిలుపునిచ్చాడు.ఇప్పుడు దేశంలో మత తత్వ రాజకీయాలను బిజెపి నీసిగ్గుగా అమలు చేస్తుంది. మతాన్ని, రామున్ని రాజకీయంలోకి లాగుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది బిజెపి. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో బిజెపి మార్కు రాజకీయం స్పష్టంగా కనిపించిందని ఎద్దేవా చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను ముందుకు తీసుకుపోతూ దేశభక్తి యుత భావాలతో, లౌకిక భారతదేశ నిర్మాణానికి మతోన్మాద, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ పౌరులందరూ పోరాడాల్సిన అవసరం ఇప్పుడు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎం డి జావిధ్,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నగర కార్యదర్శి కె అశోక్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు లెనిన్ గువేరా, స్టాలిన్, రమేశ్ కెవిపిఎస్ నాయకులు బాలపిరు,శ్రీలత,డివైఎఫ్ఐ నాయకులు హస్మి, క్రాంతి,రఘు,ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *