సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన మదర్ థెరిసా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జానీ కి అరుదైన గుర్తింపు లభించింది . జానీ స్థాపించిన మదర్ థెరిసా గ్రూప్ ద్వారా ఇప్పటివరకు 18 సార్లు రక్తదానం చేశాడు, తన మిత్రుల ద్వారా రక్తదానం చేయించాడు. ఈ సేవలను గుర్తించిన తాసుపల్లి ఫౌండేషన్ నేషనల్ బ్లడ్ సర్వీస్ సంస్థ జానీని భారత స్నేహ రత్న అవార్డుకు ఎంపిక చేసింది. కాగా ఈనెల 28న ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ నగరంలో నిర్వహించి అవార్డుల ప్రధానోత్సవం లో జానీకీ అవార్డును అందజేయనున్నట్లు సంస్థ నిర్వాహకులు సమాచారం తెలియజేశారు. ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ.. ఈ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలు నిలబెట్టడంతో పాటు సొసైటీలో గుర్తింపు వస్తుందని అన్నారు.
telugu galam news e69news local news daily news today news