జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత కేసీఆర్ పంపించారు.ఈ సందర్బంగా రాజయ్య మీడియాతో మాట్లాడుతూ..బిఆర్ఎస్ పార్టీ విధి,విధానాలు నచ్చకపోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన వర్గీయుల ద్వారా విశ్వసనీయ సమాచారం.అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య అసంతృప్తిగా ఉండటం అందరికి తెలిసిన విషయమే.కాగా రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.రాజయ్య రాజకీయ జీవితం ఎటు వైపు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి మరి.
