ఈనెల 7,8వ తేదీలలో హనుమకొండలోని జె ఎన్ ఎస్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో 35 కిలోల విభాగంలో జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లె(జి) గ్రామ జెడ్పి హెచ్ ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థి గుండెబోయిన వరుణ్ తేజ్ కాంస్య పథకం సాధించాడు.మరియు 44కిలోల విభాగంలో,ఇదే పాఠశాలకు చెందిన కొంతం రుద్విక్,38 కిలోల విభాగంలో కుక్కల హరీష్ పాల్గొన్నారు.మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ..విద్యార్థులకు ఉపాధ్యాయులు మరియు తోటి మిత్రులు,బంధువులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సీతారామయ్య,పిఈటి ఉపాద్యాయుడు గట్టు మనోహర్,మాజీ వార్డు మెంబర్ గుండెబోయిన సతీష్,పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
telugu galam news e69news local news daily news today news