telugu galam e69news daily news station ghanupur newstelugu galam e69news daily news station ghanupur news

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇబ్బందులు :కడియం

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ పరిదిలోని అశ్వారావుపల్లి రిజర్వాయర్ కుడి కాలువ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యవేక్షించారు.బతుకమ్మ కుంట నీళ్లు,నెల్లుట్ల చెరువు సైఫాన్,కలెక్టరేట్ దగ్గర నుండి సైఫాన్ 17.30 కి.మీ,16 ఎల్,ఓటి పాయింట్,నెల్లుట్ల ప్రధాన కాలువను సందర్శించి దిగువ భూములకు నీరు సరఫరా అయ్యే మార్గాల గురించి ఆరా తీశారు.లింగాలఘనపూర్ మండలంలోని గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.కాల్వల మీదుగా తానే స్వయంగా పర్యటించి కాల్వల ప్రక్కన ఉన్న చెట్లను పొదలను,తొలగించాలని సూచించారు.పర్యవేక్షణ లేక కాల్వలో చెట్లు ముళ్ళ పొదలు పెరిగాయన్నారు.తుంగ తీయకుండా మట్టి తీయకుండా నీళ్లను వడలదం సరైంది కాదన్నారు.అధికారుల అలసత్వం కానీ కాంట్రాక్టర్ల అలసత్వంతో పనులు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.అలాగే జనగామ పట్టణం నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ ని నెల్లుట్ల చెరువులో కలవడం వల్ల కలుషితమవుతుందన్నారు.దీని పై తగిన చర్యలు తీసుకొని చెరువులో నీళ్లు కలుషితం కాకుండా కాపాడాలన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రైతులను మర్చిపోయిందన్నారు.వ్యవసాయానికి కావల్సిన 24 గంటల కరెంట్ అందించడం లేదని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక జడ్పీటీసీ,ఎంపీపీ లు,స్థానిక ప్రజాప్రతినిధులు,బీఆర్‌ఎస్ నాయకులు,నీటి శాఖా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *