e69news telugu galam news local news medaram news daily updatese69news telugu galam news local news medaram news daily updates

మేడారం గ్రామం పారిశుద్ద్యం లేక దుర్గందం వెద‌జ‌ల్లుతుంది. జాత‌ర ముగిసి 12 రోజులు అవుతున్న‌ గ్రామంలో ఏక్క‌డి వ్య‌ర్ద ప‌దార్దాలు అక్క‌డే ఉండి దుర్ఘందం వేద‌జ‌ల్ల‌డంతో భ‌క్తులు, గ్రామాస్తులు ముక్కులు ముసుకుంటున్నారు. కొంత మంది దుర్వ‌స‌న భ‌రించ‌లేక గ్రామం నుండి దూర ప్రాంతాల‌కు వెలుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే పిబ్ర‌వరి 21 నుండి 24 వ‌ర‌కు తెలంగాణ అదివాసి కుంభ‌మేళా మేడారం వ‌న దేవ‌త‌ల మ‌హ జాత‌ర అత్యంత వైభవంగా కొటిన్న‌ర భ‌క్తుల రాక‌పోక‌ల‌తో మేడారం మ‌హ జాత‌ర కోల‌హ‌లంగా జ‌రిగింది. అయితే జాత‌రకు వ‌చ్చిన భక్తులు మేక‌లు,కోళ్లు,ఇంకా అనేక విధాలుగా మొక్కులు చెల్లించుకున్నారు. అయితే మేక‌ల‌, కొళ్ల వ్య‌ర్ద‌లు ఏక్క‌డి బ‌డితే అక్క‌డే వ‌దిలేయడంతో వ్య‌ర్ద‌లు దుర్వ‌స‌న వెద‌జ‌ల్లుతున్నాయి. అంతే కాకుండా ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్‌, క‌వ‌ర్స్‌తో మేడారం ప‌రిస‌ర ప్రాంతాలు అన్ని క‌న‌బ‌డుతున్నాయి. జంతు క‌ళెబ‌రాల‌తో కుళ్లు కంపు, మేడారం గ్రామంలోని స‌మీప పంట పోలాల‌లో జంతు క‌ళెబరాలు ఏక్క‌డివి అక్క‌డే ఉండ‌టంతో రైతులు అందోళ‌న చెందుతున్నారు. జాత‌ర స‌మ‌యంలో పంట‌పోలాల‌లో వెలిసిన తాత్క‌లికంగా వెలిసిన క‌ర్ర బోంగుల షెడ్డులు, జాత‌ర స‌మ‌యంలో నెల‌కోన్న జంతువుల వ్య‌ర్ద పదార్దాలతో త‌మ పంట పోలాలు నాశ‌నం అయిన‌వ‌ని రైతులు అంటున్నారు. అంతే కాకుండా ఏక‌రం పంట పోలంలో ఉన్న వ్య‌ర్ద ప‌దార్దాల‌ను, చెత్త చెదరాల‌ను, క‌ర్ర‌బోంగుల‌ను తొల‌గొంచి య‌దావీధిగా త‌మ వ్య‌వ‌సాయం కొన‌సాగించాలి అంటే కేవలం ఏక‌రం భూమి శుభ్రం చేయడానికి 20 వేల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుందని రైతులు అవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం త‌మ పంట భూమిలోకి తాము దుర్వ‌స‌న కార‌ణంగా వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని పంట భూముల ప్రాంతం అంతా కుళ్లు కంపు కొడుతున్నాయ‌ని రైతులు వేద‌న చెందుతున్నారు. మేడారం మ‌హ జాత‌ర కోసం పంచాయితీ రాజ్ శాఖ అధ్వ‌ర్యంలో 4000 మంది పారిశుద్ద్య కార్మికుల‌ను కేటాయించింది. జాత‌ర సంద‌ర్బంగా ఇంత మంది పారిశుద్ద్య కార్మికుల‌ను కేటాయించిన ఏక్క‌డి చెత్త అక్క‌డే నెల‌కోనడం గ‌మ‌నార్హం. అయితే మేడారం మ‌హ జాత‌ర ముగిసి నేటికి 12 రోజులు కావ‌స్తున్న ఏక్క‌డి చెత్త అక్క‌డే ఉండిపోయింది. ముఖ్యంగా మేడారం గ్రామంలోని షాపుల వ‌ద్ద‌ శానిటేజైష‌న్ క‌రువవ్వ‌డంతో ఈగ‌ల బెడ‌ద తీవ్రంగా మారింది. ప్ర‌స్తుతం మేడారం గ్రామ పారిశుద్ద్యం కోసం 60 మందితో శుభ్రం చేపిస్తున్న‌ట్టుగా సిబ్బంది చేపుతున్నారు. మేడారంలో కుప్పలు,కుప్ప‌లుగా పేరుకుపోయిన చెత్త‌ను 60 మందితో క్లినింగ్ చేపిస్తే ఏప్ప‌టికి గ్రామం శుభ్రం అయ్యేను అని గ్రామ‌స్తులు అంటున్నారు. ఇప్ప‌టికైన సంభందిత శాఖ అధికారులు స్పందించి గ్రామంను శుభ్రం చేసి తామ అరోగ్యాల‌ను కాపాడాల‌ని గ్రామ‌స్తులు కోరుకుంటున్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *