telugu news local news telugu news daily news e69news mulugu newsజన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం

వెంకటాపురం మండలంలోని చేయూత సచ్చింది సంస్థ ఆధ్వర్యంలో ఎస్ ఎంఆరు మోటార్స్ సహకారంతో ఏటూర్ నాగారం ప్రభుత్వాసుపత్రి లోని గర్భిణీ స్త్రీల కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంజరిగింది. ఈ కార్యక్రమాన్ని వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సై ఆర్ అశోక్,మాజీ సర్పంచ్
చిడెంయామిలి, చిడెం రవికుమార్ ,చిడెం ముత్తయ్య అతిథిగా విచ్చేసి రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది.
ఎండాకాలం తీవ్రమైన రక్త కొరత ఏర్పడుతుందని ఎటునాగులం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మల్లికాంబ మురళి మరియు సిబ్బంది మరిన్ని క్యాంపులు చేయాలని ఎంతో మంది రక్తం దొరక గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయం లో ఇబ్బంది పడుతున్నారని వేసవి కాలంలో మరిన్ని క్యాంపులు పెట్టాలని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం.సాయి ప్రకాష్ కు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు సాయి ప్రకాష్ ఎస్ ఎం ఆర్. మోటార్స్ ప్రోప్రైటర్ సాధన పల్లి కిరణ్ రక్తదానం చేశారు.ఎస్ఐ రేఖ అశోక్ మాట్లాడుతూ చేయూత ఫౌండేషన్ చేసే కార్యక్రమాల్ని అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడికి చెప్పడం జరిగింది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *