telugu galam e69 news local news suryapet newsరోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు

రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు… ప్రజా ప్రతినిదులు

గళం న్యూస్ :మార్చి 18(నడిగూడెం)

మండలం లోని రత్నవరం నుండి త్రిపురవరం వెళ్లే మార్గం లో ఉన్న కెనాల్ బ్రిడ్జి కి విరువైపులా రైలింగ్స్ లేకపోవడం తో పాటు ఎలాంటి హెచ్చరిక బోర్డు లు లేకపోవడం తో రాత్రి వేళలలో అనేక ప్రమాదాలు జరుతుండటం తో అనేక సార్లు ఆర్అండ్ బి,ఎన్ఎస్పీ అధికారుల తో పాటు ప్రజా ప్రతినిధులకు గ్రామ ప్రజలు మొర పెట్టుకున్న బ్రిడ్జి దగ్గర ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం తో రత్నవరం గ్రామ యువకులు… రాత్రి వేళలో ప్రయాణించే వాహన దారులను అలర్ట్ చేసే విధంగా కెనాల్ కు ఇరువైపుల రేడియమ్ స్టికర్స్ అంటించి ప్రమాదాలకు కొంతమేర చెక్ పెట్టె విధంగా ఆలోచన చేశారు.ఇప్పటికైన సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జి కి ఇరువైపుల రైలింగ్స్ ఏర్పాటు చేసి, రోడ్డు వెడల్పు చేసి ప్రమాదాలను అరికట్టాలని యువకులు కోరుకుంటున్నారు. గతం లోఇదే కెనాల్ లో రెండు ద్విచక్ర వాహనాలు,కారు ప్రమాదాలకు గురైనట్లు యువకులు గుర్తు చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *