satation ghanpur local news telugu news telugu galam news e69newsకాంగ్రెస్ నాయకులు సింగపురం సమ్మయ్య

-కాంగ్రెస్ నాయకులు సింగపురం సమ్మయ్య

తెలుగు గళం స్టేషన్ ఘనపూర్

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన మాదాసు వెంకటేష్ కు వరంగల్ పశ్చిమ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని 2018 లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు సింగపురం సమ్మయ్య అధిష్టానాన్ని కోరారు.స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంతో మంది వరంగల్ పార్లమెంట్ టిక్కెట్ ఆశించడం జరుగుతున్నదని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ నాయకుడైతే సేవ చేసి సేవాభావం కలిగి ఉంటాడో అలాంటి నాయకునికి టిక్కెట్ ఇవ్వాలని సమ్మయ్య అన్నారు.మాదాస్ వెంకటేష్ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు.మాదాస్ వెంకటేష్ నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఆపదలో ఉన్న ఎంతో మందికి తన సొంత డబ్బులను ఇచ్చి ఆదుకున్నారని 2018లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆయనకు టికెట్ రాకపోవడంతో కలత చెంది ఇతర పార్టీలోకి వెళ్ళడం జరిగిందని తెలిపారు.సేవా భావం కలిగిన వ్యక్తి మాదాస్ వెంకటేష్ కి కాంగ్రెస్ పార్టీ తరుపున పార్లమెంట్ టికెట్ ఇస్తే పార్టీకి మంచి పేరు వస్తుందని అన్నారు.పార్లమెంట్ టికెట్ ఇస్తే ఆయనను అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *