parkala news vote avairance news telugu galm news local news e69news telugu varthaluహనుమకొండ జిల్లా పరకాల కలెక్టర్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు పరకాల

హనుమకొండ జిల్లా పరకాల కలెక్టర్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు పరకాల బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు తెలంగాణ సంస్కృతిక సారధి పుట్ట జానకీ బృందం కళాకారులు ఆటపాటలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటుచేసి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు వెయ్యాలన్నారు. 85 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి వద్దనే ఓటు వేసే ఏర్పాటు చేయడం జరిగిందని వయోవృద్ధులకు దివ్యాంగులకు వాహన సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస రావు ఆర్డీవో కే నారాయణ, ఎసిపి కిషోర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ నరసింహ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజకుమారి, ఏ ఈ ఏ పీ ఓ ఇందిరా, సిడిపిఓ భాగ్యలక్ష్మి,మండల పంచాయతీ అధికారి భాస్కర్ మెడికల్ పంచాయతీ రాజ్ శ్రీలత, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమణ, ఏపీఓ క్రాంతి, అంగన్వాడి సూపర్వైజర్లు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు మున్సిపల్ సిబ్బంది ఆశాలు గ్రామపంచాయతీ సిబ్బంది అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *