కడియం కావ్య congress news kadiyam kavya news mp elections station ghanpur news telugu galam news e69news local newsప్రచారంలో దూసుకుపోతున్న వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డా. కడియం కావ్య శుక్రవారం వరంగల్ ఓసిటీ గ్రౌండ్ లో మరియు వరంగల్ ఫోర్ట్ గ్రౌండ్‌లో వాకర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయాన్నే గ్రౌండ్‌ వద్దకు వెళ్లి వాకర్లు, ఎంప్లాయిస్, రిటైర్డ్ ఎంప్లాయిస్, సీనియర్ సిటిజన్లు, యువతను కలిశారు. వారితో కలిసి వాకింగ్ చేశారు. క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం అక్కడి కూరగాయలు అమ్మే వ్యాపారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి డా. కడియం కావ్య గారు మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, రాహుల్ గాంధీ నేతృత్వంలో పాంచ్ గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఎంపీగా తనను ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందామని స్పష్టం చేశారు. యువత ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *