congress news mahabubabd news local news telugu gaam news telug varthalu e69newsమహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం విస్సంపల్లి లో ఘటన.!

బిఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్య ఇస్తే ఎట్లా?

*ఎమ్మెల్యే రామచంద్రునాయక్ ఎదుటే అ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం.!

  • మీ వైఖరి నచ్చట్లేదు ప్రచారం కూడా చెయ్యం అంటూ అక్కడినుంచి వెళ్లిపోయిన ఒక వర్గం కార్యకర్తలు.!
  • ‌మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం విస్సంపల్లి లో ఘటన.!

మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్:-

మరి కొద్ది రోజుల్లో పార్లమెంటరీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ అధ్యక్షతన చిన్నగూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో సన్నాహక సమావేశాల్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా విస్సంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆ పార్టీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తల నడుమున జరిగిన మాటల యుద్ధం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.సన్నాహాక సమావేశం అనంతరం ఓ నాయకుని ఇంటికి ఎమ్మెల్యే వెళ్లగా కాంగ్రెస్ పార్టీ పాత క్యాడర్ కు చెందిన కొంతమంది కార్యకర్తలు బి ఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తల్ని విమర్శించ సాగారు గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పైసలు పంచి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారని వాళ్లకి మీరు ప్రియారిటిస్తున్నారని మీరు ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఒక్కొక్కరి కాళ్లు పట్టుకొని ఓట్లే వేయించాం అంటు వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం మాకు నచ్చలేదు మేము మీతో ప్రచారంలో పాల్గొనబోమంటూ అక్కడి నుంచి పాత క్యాడర్ కార్యకర్తలు కొంతమంది వెళ్లిపోగా వాళ్లు వీళ్లు అంతా నాకు ముఖ్యమే వాళ్లది వినను మీది వినను అంటు మీకు వీళ్ళకి గేట్ల పంచాయతీ ఏం లేదు కదా మీకు నేనేం తిండి పెట్టను మీ ముద్ద ముద్ద మీరే తినాలి అంటూ నేను రెండు నిమిషాలు ఎలక్షన్ ఎట్లా చేయాలనో చెప్పి వెళ్ళిపోతానంటూ మరి కొంతమందికి సదరు ఎమ్మెల్యే సర్ది చెప్పడం జరిగింది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *