సంక్షేమ హాస్టలను పర్యవేక్షించిన పిఓసంక్షేమ హాస్టలను పర్యవేక్షించిన పిఓ

విద్యార్థులు ఎవరు కూడా బయటికి రావద్దు

మణుగూరు: భారీ వర్షాలకు మణుగూరు మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ముంపునకు గురి అయినందున వారిని సురక్షితంగా తరలించడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
ఏడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా మణుగూరులోని డిగ్రీ కాలేజ్ మరియు గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్, బాలుర హాస్టల్ వరద ముంపునకు గురి అవ్వడంతో విద్యార్థిని, విద్యార్థులందరినీ పి ఎం హెచ్ హాస్టల్ కు తరలించడం జరిగిందని ఆయన అన్నారు. తుఫాన్ ప్రభావం వలన వర్షాలు ఇంకా పడే సూచనలు ఉన్నందున వరదలు తగ్గుముఖం పట్టే వరకు విద్యార్థిని విద్యార్థుల పట్ల వార్డెన్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థిని విద్యార్థులు ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్లకూడదని వాగులు చెరువులు వైపు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అన్నారు. అనంతరం పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందుతున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడుతున్నందున విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యం పట్ల కూడా సంబంధిత హెచ్ఎం లు వార్డెన్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ స్థానికంగా ఉండి విద్యార్థిని విద్యార్థులు ఎవరు బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏ టి డి ఓ అశోక్ కుమార్, పాఠశాల హెచ్ఎం, వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *