హసన్ పర్తి, హన్మకొండ జూలై 25 (ఈ69న్యూస్):
హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన నల్గొండ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన కోనేటి అంజి బాబు (S/o యాదయ్య, వయసు: 38, వృత్తి: డ్రైవర్)ను మేజిస్ట్రేట్ వేణుగోపాల్ ఎదుట హాజరు పరిచారు.వాదనలు,సాక్ష్యాలు పరిశీలించిన అనంతరం మేజిస్ట్రేట్ కోనేటి అంజి బాబుకు 5 రోజుల జైలు శిక్ష విధించారు.శిక్షను అనుసరించి అతనిని పరకాల సబ్ జైలుకు తరలించారు.పోలీసులు డ్రంకెన్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మరియు ప్రజల ప్రాణభద్రతకు ముప్పుగా మారే చర్యలపై శిక్షలు తప్పవని అధికార వర్గాలు హెచ్చరించాయి.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *