ఈ69న్యూస్ వరంగల్ ఆగస్టు 29

ఖిలా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ACB)అధికారులు ఈ ఉదయం సడన్‌గా సోదాలు నిర్వహించారు.అధికారుల బృందం ఉదయం వేళలోనే తహసీల్దార్ నివాసానికి చేరుకుని,పత్రాలు,ఆస్తుల వివరాలు,నగదు లావాదేవీలపై దర్యాప్తు చేపట్టింది.ప్రాథమిక సమాచారం ప్రకారం,అవినీతి సంబంధిత ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయని తెలిసింది.ఇంటి అంతటా సోదాలు కొనసాగుతుండగా,తహసీల్దార్ కుటుంబ సభ్యులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.ఆస్తుల విలువ,కదలికలు,అలాగే బ్యాంకు ఖాతాలపై కూడా ఏసీబీ సోదాలు విస్తరించనున్నట్లు సమాచారం.ఈ సోదాల కారణంగా ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *