కడారి గూడెం గ్రామంలో అశాస్త్రీయంగా వార్డుల విభజనకడారి గూడెం గ్రామంలో అశాస్త్రీయంగా వార్డుల విభజన

వరంగల్ జిల్లా ఆగష్టు 30 వర్ధన్నపేట మండలంలోని కడారి గూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి’ కుందూరు మహేందర్ రెడ్డి. మీడియాతో మాట్లాడుతూ” స్థానిక సంస్థలతో ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం వార్డుల విభజన అశాస్త్రీయంగా చేపట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అడ్డదారిలో గెలవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని గత ఆరు నెలలుగా ఓటర్ లిస్ట్ సవరణలో ఎన్నోసార్లు అధికారులు మీటింగులు పెట్టి సవరణలు చేస్తున్నామని అటువంటివి ఏమి చేయకుండా పార్లమెంట్ ఎలక్షన్ లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ఆధారంగా వార్డుల విభజన చేయడం చాలా విడ్డూరంగా ఉంది అని గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వారిని కూడా ఓటర్ లిస్టులో అలాగే ఉంచారని ఒకే వ్యక్తికి ఒకే వారిలో రెండు ఓట్లు ఉన్నాయని వాటిని కూడా సవరణ చేయకుండా ఓటర్ లిస్టును విడుదల చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తప్పు ఒప్పులను సరిదిద్దుకొని క్రమ పద్ధతిలో విభజన చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్, మడత రాజేష్, గోరుకంటి అనిల్, పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *