డాక్టర్ కె విజయ భాస్కర్ సేవలు చిర స్మరణీయండాక్టర్ కె విజయ భాస్కర్ సేవలు చిర స్మరణీయం

పరకాల మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కె విజయ భాస్కర్ సహాయ సంచాలకులు పరకాల జిల్లా పశువైద్యాధికారిగా పదోన్నతి పై పెద్దపల్లి జిల్లా కు వెళ్ళిన సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల ఆంజనేయులు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయం లో పర్యవేక్షకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలు మండల స్థాయి అధికారులు అందరూ మాట్లాడుతూ డాక్టర్ వెంకటనారాయణ బదిలీ బాధాకరం కానీ పదోన్నతి పై వెళ్లడం సంతోష దాయకం అని వారు పని చేసిన 6 మాసాలలో మండలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చాకచక్యంగా పరిపాలన సాగించారని కొనియాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ కె విజయ భాస్కర్ మాట్లాడుతూ పరకాల మండలంలో పంచాయతీ రాజ్ శాఖ లో సుదీర్ఘ అనుభవం కలిగిన టీం లీడర్ యంపిడీఓ పెద్ది ఆంజనేయులు,పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారని తనకు ప్రత్యేక అధికారిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేశారని ప్రశంసించారు
అనంతరం ఆయనను యంపిడీఓ, కార్యాలయ, ఈజియస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు శాలువా మెమెంటో మరియు పూల మాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నడికుడ మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్రీరాం, పశు సంవర్ధక శాఖ అసోషియేషన్ ప్రతినిధులు కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపీఓ ఇందిర, ఈసీ రజనీకాంత్ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వెంకట లక్ష్మణ్, కార్యదర్శులు సుమలత రిజ్వానా శ్రీనివాస్, ప్రవీణ్ కిరణ్, టెక్నికల్ అసిస్టెంట్లు సుమలత కుసుమ ఫీల్డ్ అసిస్టెంట్లు కోమల కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *