చెంచుపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహణచెంచుపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహణ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ హిమబిందు ఆధ్వర్యంలో చెంచుపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.ఎప్పుడు కాచి చల్లార్చిన నీటినే ఉపయోగించాలిని,వేడి వేడి పదార్థాలు తినాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు గ్రామస్తులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి హిమబిందు,పంచాయితీ కార్యదర్శి నరేష్,ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *