భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న-వరంగల్ ఎం.పీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న-వరంగల్ ఎం.పీ

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారిని, వేయి స్తంభాల ఆలయంలో దుర్గామాతను సోమవారం స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ, దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, సమాజానికి శుభసూచకమార్గదర్శకత్వాన్ని అందిస్తాయన్నారు. వరంగల్ చారిత్రక ఆలయాలు, దేవాలయాలు మన సంస్కృతి వైభవానికి ప్రతీకలని తెలిపారు. దేవి కటాక్షంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, వరంగల్ మహానగరం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా భక్తుల సౌకర్యం కోసం ఆలయాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు తాను కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. అనంతరం భక్తులకు చీరల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *