ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డుస్మరణ కుమ్మరి రాజుఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డుస్మరణ కుమ్మరి రాజు

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30న జరిగే విద్యాసంస్థల బంధువులు జయప్రదం చేయండి

ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 300 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ..

ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డుస్మరణ కుమ్మరి రాజు

తెలుగు గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలనిభూపాలపల్లి జిల్లా కేంద్రంలో 300 విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్వరం కుమ్మరి రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అని వారు అన్నారు.ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి రాగానే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధుల పైన విద్యా రంగానికి కేటాయిస్తామని చెప్పి విద్యార్థులు మోసం చేసింది అని వారు అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిరసన కార్యక్రమం చేశారు.స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే భవిష్యత్తులో ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.అదేవిధంగా ఈనెల 30వ తేదీన జరిగే రాష్ట్రవ్యాప్తంగా బందును సంబంధించి డిగ్రీ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రొఫెషనల్ కళాశాలలో డిప్లమో కళాశాల యూనివర్సిటీలు బంధుని జయప్రదం చేయాలని వారు సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సకినాల వికాస్ జిల్లా కమిటీ సభ్యుడు వంశీ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *