రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంరైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

బుధవారం ఉదయం భూపాలపల్లి మండలం కొంపల్లి, గుడాడ్ పల్లి, నేరేడుపల్లి, గొర్లవీడు గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు.ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు.రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు.రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.అనంతరం గొర్లవీడు గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటా పలువురు ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *