పీవీకి కృతజ్ఞతలు తెలిపిన నూతన కమిటీ ప్రతినిధులుపీవీకి కృతజ్ఞతలు తెలిపిన నూతన కమిటీ ప్రతినిధులు

ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీని ఇటీవల ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఖమ్మంజిల్లాకు చెందిన ప్రముఖ మిర్చి వ్యాపారి పోలిరెడ్డి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఖమ్మంలో సన్మాన సభ నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు బత్తిని నరసింహారావు, ప్రధాన కార్యదర్శి జీవై నరేష్, కోశాధికారి తల్లాడ రమేష్ లను సన్మానించారు. మిర్చి శాఖ అధ్యక్షులుగా మెంతుల శ్రీశైలం (ఎంఎస్), కార్యదర్శిగా ఎడ్లపల్లి సతీష్ (వైఎస్) శాలువాలు పూలమాలతో సన్మానించి సత్కరించారు. వారితోపాటు కోల్డ్ స్టోరేజ్ శాఖ అధ్యక్షులుగా గీతా వెంకన్న, మిర్చిశాఖ ఈసీ మెంబర్లు పర్వతనేని నరేందర్, ఉపేందర్, సెంట్రల్ ఈసీ మెంబర్ రాయపూడి రవికుమార్, దిగుమతి శాఖ ఈసీ మెంబర్ సారిక పాపారావును సన్మానించారు. అనంతరం పివి మాట్లాడుతూ నూతన కమిటీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతిష్టను పెంపొందించే విధంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యక్రమం నిర్వాహకులు పోలిరెడ్డి వెంకటేశ్వరావును వారు ప్రత్యేకంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొంగలి నాగరాజు, పాయల నాగేశ్వరరావు, ముత్యం ఉప్పలరావు, కేవీ చారి, బాలు వీరా రావు, కొప్పురావూరి వెంకటకృష్ణ, రంగా జనార్దన్, ముళ్ళపాటి సీతారాములు, పెరుగొండ రామారావు, గణేష్, పుల్లారావు, తోట వెంకటేశ్వరరావు, రాజేష్, రాము, బండారు శ్రీను, పాషా, పట్టణ ప్రముఖులు, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *